అను ఇమాన్యూయల్ తో అఫైర్ గురించి స్పందించిన అల్లు శిరీష్...!!

murali krishna
అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మానియేల్ తో ఎఫైర్ నడుపుతున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ తరచుగా ఆఫ్ స్క్రీన్ లో కనిపించడం ఆ వదంతులకు కారణమైంది.


ఎలాంటి సంబంధం లేకుండా సన్నిహితంగా ఉంటారా? వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ టాలీవుడ్ కోడై కూసిందట.. వరుస కథనాలు నేపథ్యంలో అల్లు శిరీష్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో అను ఇమ్మానియేల్ తో తనకున్న అనుబంధం ఏమిటో తెలియజేశారట..


సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటి రూమర్స్ సాధారణమే గతంలో కూడా ఇలాంటి పుకార్లు కూడా వచ్చాయి. ప్రచారం అవుతున్నట్లు అను ఇమ్మానియేల్ తో నాకు అలాంటి సంబంధం లేదు. మేము మంచి మిత్రులం మాత్రమే. కలిసి పని చేయడం వలన అనుబంధం పెరిగింది. అలాగే తన అభిరుచులు నావీ చాలా దగ్గరగా ఉంటాయి. మ్యూజిక్, సినిమాలు, పుస్తకాలు ఇలా అనేక విషయాలు ఇద్దరివీ కామన్ గా ఉంటాయి. దాని వలన ఎక్కువగా కలవడం మాట్లాడుకోవడం జరిగిందని చెప్పుకొచ్చాడు.


అలాగే వర్క్ విషయంలో ఆమె ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఆ కారణంగా నాతో రొమాంటిక్ సన్నివేశాల్లో ఫ్రీగా నటించింది. స్నేహానికి మించి మా మధ్య ఏమీ లేదు, అని అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడట.. ఆయన ఇంకా మాట్లాడుతూ… సోషల్ మీడియా నెగిటివిటీకి దూరంగా ఉంటే మంచిది. అందుకే రెండేళ్లుగా సోషల్ మీడియా వాడటం లేదు. నాలాగే మిగతా సెలెబ్రిటీలు సోషల్ మీడియాను దూరం పెట్టడమే ఉత్తమం అని, శిరీష్ అభిప్రాయపడ్డారట.ఆ మధ్య అల్లు శిరీష్ అలిగి ఇంటి నుండి వెళ్లిపోయాడని, ఒంటరిగా ముంబైలో ఉంటున్నాడని కూడా వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు అల్లు ఫ్యామిలీ ఫొటోల్లో శిరీష్ కనిపించలేదు.



అల్లు శిరీష్-అను ఇమ్మానియేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4న విడుదల అవుతుంది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఎట్టకేలకు మోక్షం కలిగిందట.రాకేష్ శశి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక సరైన బ్రేక్ కోసం అల్లు శిరీష్ ఏళ్ళు గా ఎదురుచూస్తున్నారు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా కనీస గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఊర్వశివో రాక్షసివో చిత్రంపై ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: