ఇండస్ట్రీలో డబ్బుపై స్నేహం ముడిపడి ఉంటుంది. ఒక్కసారి ఒక కాంబినేషన్ హిట్ అయ్యిందంటే అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అలాంటి హిట్ పెయిరే సుకుమార్-దేవిశ్రీ
ప్రసాద్ లది కూడా.తన మొదటి
సినిమా ఆర్య నుండి నేటి పుష్ప2 వరకు
సుకుమార్ ప్రతి సినిమాకి
దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. హిట్, ఫ్లాప్ కి సంబంధం లేకుండా వీరిద్దరూ కలిసి చేయటం వెనుక వీరి స్నేహం కారణమని అంటుంటారు. ఇండస్ట్రీలోని అతికొద్ది మంది ప్రాణ స్నేహితుల్లో సుక్కు- దేవిశ్రీలు ఉంటారట. నేను శరీరం అయితే దేవిశ్రీ నా ఆత్మ అని
సుకుమార్ చాలాసార్లు స్టేజిపై చెప్పాడు కూడా. అలాంటి ఈ స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఒక
సినిమా రెమ్యునరేషన్ విషయంలో
సుకుమార్, దేవిశ్రీ మధ్య గ్యాప్ పెరిగిందని ఇండస్ట్రీలో టాక్. తన సినిమాలకే కాకుండా తన శిష్యుల సినిమాలకు కూడా దేవిశ్రీ మ్యూజిక్ చేస్తాడు. తాజాగా
సాయి ధరమ్ తేజ్ హీరోగా
సుకుమార్ శిష్యుడు
శ్రీధర్ దర్శకత్వంలో
సినిమా ఒకటిరాబోతుంది.ఈ సినిమాకి కథ, మాటలు అందిస్తున్న సుకుమారే
నిర్మాత కూడా. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ చేయడానికి 4 కోట్లు డిమాండ్ చేశాడట దేవిశ్రీప్రసాద్. కానీ 2కోట్లే ఇస్తానని
సుకుమార్ చెప్పాడట. ఈ రెమ్యునరేష్ కి దేవిశ్రీ ఒప్పుకోకపోవటంతో చెప్పాపెట్టకుండా దేవిశ్రీ స్థానంలో అంజనీష్ అనే మరో
సంగీత దర్శకుడిని పెట్టుకున్నాడట. దాంతో అలిగిన
దేవిశ్రీ ప్రసాద్ అసలు
సుకుమార్ తో మాట్లాడటమే ఆపేసి.. కనీసం
ఫోన్ లో కూడా అందుబాటులోకి రావట్లేదని అంటున్నారు. అయితే ఈ గ్యాప్
సాయి ధరమ్ తేజ్ మూవీ కారణంగా ఏర్పడ్డ.. ఎఫెక్ట్ మాత్రం పుష్ప2 పై పడుతుందని వార్తలు వస్తున్నాయి. పుష్ప2 మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఎంత ప్రయత్నించినా
సుకుమార్ టీమ్ కి దేవిశ్రీ దొరకటం లేదట. ఇకసుకుమార్ స్వయంగా కాల్ చేస్తే పరిస్థితి చల్లబడుతుంది అనుకుంటే.. దేవీశ్రీని
సుకుమార్ కూడా లైట్ తీసుకుని కాల్స్ చేయటం లేదట. దీంతో వీరిద్దరి ఈగో క్లాష్.. పుష్ప2 సంగీతంపై ఎక్కడ పడుతుందో అని
బన్నీ ఫాన్స్ తెగ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం.