నాని డైరెక్టర్స్ ను లైన్లో పెడుతున్న విజయ్ దేవరకొండ..!!
నేచురల్ స్టార్ నాని తో 'నిన్ను కోరి' సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ. ఈయన డైరెక్షన్‌లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం పేరు 'ఖుషీ'.
విజయ్ దేవరకొండ హీరో గా, సమంత హీరోయిన్‌గా రూపొందుతోంద ట ఈ సినిమా.
శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇటీవ ల కాస్త గ్యాప్ అయితే తీసుకుంది. అందుకు సమంత అందుబాటులో లేకపోవడమే కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు 'లైగర్' ఫెయిల్యూర్‌తో విజయ్ దేవరకొండ కూడా కాస్త డిప్రెషన్‌లో వున్న విషయం తెలిసిందే.
కారణం ఏదైతేనేం, కొద్దిగా దొరికిన ఈ టైమ్‌ని కథలు వినడానికి యూజ్ చేసుకుంటున్నాడట రౌడీ. ఆ క్రమంలోనే నాని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఓ కథను కూడా వినిపించాడట. విజయ్‌కి ఆ స్టోరీ తెగ నచ్చేసిందట. కలిసి పని చేద్దాం అని హామీ కూడా ఇచ్చాడట. 'గాడ్ ఫాదర్' ప్రొడ్యూసర్ ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ముందు కొచ్చారనీ సమాచారం.
అన్నీ కుదిరితే, వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కట్ చేస్తే, ఈ డైరెక్టర్ ఎవరో కాదు, నానికి 'జెర్సీ'తో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన 'జెర్సీ' మాదిరి ఇది కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వుండే స్టోరీ అని చూజాయగా తెలుస్తోంది.
సో, ఆ నమ్మకంతోనే విజయ్ కూడా ఈ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టేసి వుండొచ్చు. చూస్తుంటే, నాని డైరెక్టర్లందరినీ వరుసగా విజయ్ దేవరకొండ లైన్‌లో పెడుతున్నట్లు కనిపిస్తోంది. మరీ.ఇప్పటికే లైగర్ ప్లాప్ తో డీలా పడ్డ విజయ్ కి ఈ మూవీస్ హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ మూవీస్ కూడా ప్లాప్ అయితే విజయ్ పరిస్థితి దారుణంగా ఉంటుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలు అన్ని కూడా ఖుషి సినిమా పైనే వున్నాయి. ఈ సినిమాతో నిరూపించుకోవాలని చూస్తున్నాడు.