బాలకృష్ణ... గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తేరకెక్కుతున్న మూవీ నుండి మరో క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ హీరో లలో ఒకరు అయిన నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అఖండ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి తన నటన తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.


ఇది ఇలా ఉంటే అఖండ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా అఖండ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.


మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దునియా విజయ్మూవీ లో విలన్ గా కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీbలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 6 వ తేదీన లేదా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలి అని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: