'పవన్ కళ్యాణ్, పునీత్ తర్వాత కార్తీనే అలా చూసాను'.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..!!

Anilkumar
తమిళ్ స్టార్  హీరో  అయిన కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. కార్తీ నటించిన చాలా  సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలు అందుకున్నాయి. ఇకపోతే యుగానికొక్కడే, ఆవారా, ఖైదీ, ఖాకీ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ.అంతేకాదు అలాగే కార్తీ తెలుగులోనూ స్ట్రయిట్ చేశారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి తో తెలుగులో స్ట్రయిట్ చేశారు కార్తీ. ఈ సినిమా  లో కింగ్ నాగార్జున తో కలిసి నటించారు కార్తీ. ఈ సినిమా  లో నాగ్ నటనతో పాటు కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కార్తీ అన్న సూర్య మాదిరిగానే హిట్లు, 

ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ లను లైనప్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇదిలావుంటే ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో కార్తీ నటించాడు. అయితే రీసెంట్ గా సర్ధార్ అనే తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక తాజాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు.ఇక  ఈసందర్భంగా నాగ్ మాట్లాడుతూ..కార్తీతో ఊపిరి చేశాను. ఇక అప్పటి నుండి కార్తీతో అనుబంధం మొదలైయింది.అంతేకాదు  అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని ప్రజంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది.

 ట్రైలర్ అదిరిపోయింది.ఇక  ఈ సినిమా చేసినందుకు కార్తీ గర్వపడుతున్నానని చెప్పారు. అయితే కార్తీ అన్న సూర్య సూపర్ స్టార్. ఇక ఆ సూపర్ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి ప్రూవ్ చేసుకోవడం చాలా అరుదు.ఇక  అలాంటి వాళ్ళని ఇద్దరినే చూశాను. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్.. కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తీ. ఇలా స్టార్ డమ్ సంపాదించాడంటే మామూలు విషయం కాదు అన్నారు.ఇకపోతే కార్తీ చాలా వైవిధ్యమైన లు చేసి సూర్య అంత సూపర్ స్టార్ అయ్యారు. ఇక కార్తీ తెలుగులో మాట్లాడటమే కాదు పాటలు కూడా పాడుతాడు. అయితే తెలుగు మాట్లాడేవాళ్ళని మనం వదలం.అంతేకాదు అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు. ఇక సర్దార్ ని కూడా గొప్పగా తీసుంటాడని నమ్ముతున్నాను.కాగా  అక్టోబర్ 21న అందరూ థియేటర్ లో ‘సర్దార్’ చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు నాగార్జున..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: