తాజాగా
కన్నడ స్టార్
హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార
సినిమా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రముఖ భాషల్లో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇకపోతే కాంతార సినిమాకు
రిషబ్ హీరో కావడంతో పాటు
డైరెక్టర్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే.అయితే ఈ
సినిమా సక్సెస్ వల్ల
టాలీవుడ్ స్టార్
ప్రొడ్యూసర్ అయిన
అల్లు అరవింద్ నుంచి
రిషబ్ శెట్టికి బంపర్ ఆఫర్ దక్కిందని సమాచారం అందుతోంది.కాగా కాంతార సినిమాలో
రిషబ్ శెట్టి అద్భుతమైన నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే.
అయితే ప్రశాంత్ నీల్,
రిషబ్ శెట్టి మరి కొందరు
కన్నడ దర్శకులు తమ టాలెంట్ తో
కన్నడ ఇండస్ట్రీ రేంజ్ ను పెంచుతున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం వరకు
కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలపై ఇతర భాషల ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఉండేది. అయితే ఇక కన్నడ ఇండస్ట్రీ సినిమాల విజయాల ద్వారా ఈ అభిప్రాయం మారుతోంది.ఇకపోతే
అల్లు అరవింద్ భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసి
రిషబ్ శెట్టితో తర్వాత ప్రాజెక్ట్ తెరకెక్కించేలా ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇక ఇతర భాషల్లో సినిమాలు చేసినా
కన్నడ ఇండస్ట్రీని
వదిలిపెట్టే ఉద్దేశం అయితే లేదని
రిషబ్ శెట్టి క్లారిటీ ఇవ్వడం గమనార్హం.కాగా గీతా ఆర్ట్స్ నిర్మించినా కన్నడలో
రిషబ్ సినిమాను నిర్మించి ఇతర భాషల్లోకి డబ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.అయితే ఇక
రిషబ్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తారో లేక దర్శకుడిగా కెరీర్ ను కొనసాగిస్తారో చూడాల్సి ఉంది. ఇక ఈతరం హీరోలలో ఏ హీరోకు లేని టాలెంట్
రిషబ్ కు ఉందని హీరోగా,
డైరెక్టర్ గా
సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించడం
రిషబ్ శెట్టికే సాధ్యమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే కాంతార
హీరో తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది..!!