కాంతార సినిమాపై అల్లు అరవింద్‌

murali krishna
కాంతార సినిమాను ఇంతలా ఆదరించినందుకు అందరికీ నమస్కారం పెట్టేందుకు మీ ముందుకు వచ్చామన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం కాంతార.
తెలుగులో గీతాఆర్ట్స్‌ విడుదల చేసింది.
కాంతార సినిమా విడుదల కాకముందు ఓ సారి చూడండి అని చెప్పాం. ఈ సినిమాను ఇంతలా ఆదరించినందుకు అందరికీ నమస్కారం పెట్టేందుకు మీ ముందుకు వచ్చామన్నారు నిర్మాత అల్లు అరవింద్‌ . కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం 'కాంతార'. తెలుగులో గీతాఆర్ట్స్‌ విడుదల చేసింది. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు, టీంతో కలిసి సక్సెస్‌ మీట్‌కు హాజరయ్యారు నిర్మాత అల్లు అరవింద్‌.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాకు భాషా సరిహద్దు లేదు..ఒక ఎమోషన్‌ బారియర్‌మాత్రమే ఉంటుంది. ఏ ఎమోషన్‌తో సినిమా తీశారో జనం ఆ ఎమోషన్‌కు కనెక్ట్‌ అయిపోతారు. మట్టిలో నుంచి పుట్టిన కథ ఇది. ఎక్కడి నుంచో ఇంగ్లీష్‌ సినిమా చూసో..యూరప్‌ సినిమా చూసో, కొరియన్‌ సినిమా చూసో కథ రాసి తీసిన సినిమా కాదిది. అదే మట్టిలో పుట్టి..ఆయన వాళ్ల ఊరిలో చూసిన కొన్ని విశేషాలను ఈకథలోకి తీసుకొచ్చి..తన ఊళ్లో ఫీలైన ఎమోషన్‌ను కథలోకి తీసుకురావడం వల్ల ఆ కనెక్ట్‌ ఉంటది. సినిమా చూసిన తర్వాత విష్ణు తత్వం, రౌద్రరూపం కలిపి మన వైజాగ్‌ దగ్గరున్న సింహాచలం కథలా అనిపించిందన్నారు అల్లు అరవింద్‌.
అంజనీష్‌ లోక్‌నాథ్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతం. సినిమాలో ఇదివరకెపుడూ వినని డిఫరెంట్‌ కోరస్‌ సౌండ్స్‌ కొన్ని మ్యూజిక్‌తో కలిపి బ్యాక్‌ గ్రౌండ్‌లో వస్తాయి. ఆదేంటని మ్యూజిక్‌ డైరెక్టర్‌ను అడిగా. ఊళ్లో జాతరలు జరిగేటపుడు మనుషులు కూసే కూతలు రికార్డు చేసుకొచ్చి..మ్యూజిక్‌తో కలిపి చూపించినట్టు ఆయన చెప్పాడు. అందువల్లే సినిమాలో అద్భుతమైన ఎఫెక్ట్‌ వచ్చిందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: