బాలీవుడ్ ఫేమస్
డైరెక్టర్ అండ్
ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ సినిమాతో
బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు “వరుణ్ ధావన్”. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', 'బద్లాపూర్', 'స్ట్రీట్ డ్యాన్సర్' సహా పలు అద్భుత సినిమాలతో
బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు
వరుణ్ ధావన్. తొలి నుంచి కథా బలం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తుస్తున్నాడు. జయాపజయాలతో పని లేకుండా
హిందీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు. ఓ భారీ హిట్ తో మళ్లీ ట్రాల్ లోకి రావాలని అనుకుంటున్నాడు.ఈ
యువ కథానాయకుడు ఇప్పుడు ఒక సూపర్
హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.దాదాపు రూ.220 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
వరుణ్ తోడేలు మనిషి పాత్ర పోషించబోతున్నాడు.
పాన్
ఇండియా మూవీగా వస్తున్న ఈ
సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. అనుకోని సంఘటనల కారణంగా
హీరో వరుణ్ ని ఒక తోడేలు కరుస్తుంది. ఆ గాయం వలన
హీరో శరీరంలో కొన్ని జెన్యూ మార్పులు జరిగి, తోడేలులా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే, పౌర్ణమి నాడు పూర్తిస్థాయి తోడేలుగా మారిపోయి ప్రజలపై దాడి కూడా చేస్తాడు.ఇక ఈ సమస్య నుంచి ఎలాగైనా బయట పడాలని అతడి ఫ్రెండ్స్ సహాయం కోరతాడు. ఆ సమస్య నుంచి బయటపడ్డాడా లేదా అన్నది
సినిమా చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ చాలా ఆసక్తిగా బాగా ఆకట్టుకుంటుంది.అయితే ఇటువంటి సినిమాలు
హాలీవుడ్ లో చాలానే వచ్చాయి. మరి ఈ
సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో
కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.నవంబర్ 25 న హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. మరి ఈ
సినిమా వరుణ్ కి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.