రజనీకాంత్ రికార్డును RRR సినిమా బ్రేక్ చేయగలదా..?
ముఖ్యంగా జపాన్ లో ఈ సినిమా ప్రత్యేకంగా కొన్ని షోలు విడుదల చేయబోతున్నారు.ఇదివరకే డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాను కూడా అక్కడ విడుదల చేయగా భారీగానే కలెక్షన్లు అందుకున్నాయి. అలాగే అక్కడ సాహో సినిమా కూడా విడుదల కాగా జపాన్లో అత్యధిక కలెక్షన్లు అందుకున్న ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు జపాన్ లో విడుదలయ్యాయి. ఇక 27 ఏళ్ల క్రితం జపాన్లో రజనీకాంత్ క్రియేట్ చేసిన ఒక రికార్డును మాత్రం ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోతున్నాయి. రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా జపాన్ లో విడుదలై అక్కడ 400M మిలియన్ల కలెక్షన్లను అందుకున్నది దాదాపుగా ఇండియన్ కరెన్సీ తో ప్రకారం రూ. 20 కోట్ల రూపాయలతో సమానమట.
ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ను rrr రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయంపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ రాజమౌళి కూడా అక్కడ సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లడం జరిగింది. ప్రమోషన్లలో వారికి మంచి రెస్పాన్స్ కూడా లభించింది ఇదివరకే ట్రైలర్ విడుదల చేయగా మంచి క్రేజ్ రావడంతో ఈ సినిమా కచ్చితంగా అక్కడ ఆకట్టుకుంటుందని చిత్ర బంధం నమ్మకంతో ఉన్నారు. ఇక జపాన్ లో రాజమౌళి సక్సెస్ అందుకుంటే భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు కూడా అక్కడ విడుదల అయ్యేందుకు అవకాశం ఉందని చెప్పవచ్చు.