సినిమా హిట్ అయిన కాని ఆమెకు నో ఆఫర్స్ .!!

murali krishna
మళయాళ సిని ఇండస్ట్రీ నటి కీర్తి సురేష్‌కు మంచి హిట్‌ కొట్టాల్సిన అవసరం చాలానే ఉంది ఆమెకు. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా ఇటీవల సక్సెస్‌కు  బాగా దూరమైంది.
తమిళంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి నటించిన సాని కాగితం చిత్రంలో నటనకు కీర్తీ సురేష్‌   మంచి ప్రశంసలు అందుకున్నా ఆ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో తగిన గుర్తింపు రాలేదు మరీ, ఇక తెలుగులోనూ ఇటీవల చెప్పుకునేంత సక్సెస్‌లు రాలేదు. ప్రస్తుతం అక్కడ బోళా శంకర్‌ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగానూ, దసరా చిత్రంలో నానికి జంటగా నటిస్తున్న చిత్రాలు  కీర్తి సురేష్ చేతిలో ఉన్నాయి.
వీటిలో బోళా శంకర్‌ చిత్రం హిట్‌ అయినా ఆ క్రెడిట్‌ అంతా చిరంజీవికి మాత్రమే పోతుంది. ఎటు తిరిగి దసరా చిత్రంతో ఈమె సక్సెస్‌ అందుకుంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది మరీ ఇక కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్‌ సరసన నటిస్తున్న మామన్నన్‌ త్రంపైనే ఆశలు పెట్టుకుంది. మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా త్వరలో శింబుతో రొమాన్స్‌ చేయడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగమ్మ.
ఇలాంటి సందర్భంలో కీర్తి సురేష్‌ నటిగా తాను నటిస్తున్న పాత్రల గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తను కథ విన్నప్పుడు నచ్చితే అందులోని పాత్రలో లీనమైపోతానని  ఇలా పేర్కొంది నటి. నటించడానికి ముందే ఆ కథా పాత్ర, దాని రపురేఖలు ఎలా ఉండాలి అన్నది మనసులోకి ముద్రపడిపోతాయని చెప్పింది ఈ భామ. నటించే సమయంలో ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తానని చెప్పింది. షూటింగ్‌ పూర్తయినా ఆ పాత్రల ప్రభావం తనపై చాలా కాలం ఉంటుందని చెప్పింది. అవి తనను వదలకుండా వెంటాడుతూనే ఉంటాయని తెలిపింది. అలా కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా తనతో పయనిస్తాయని కీర్తి సురేష్‌ ఇలా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: