మాస్ మహారాజ రవితేజ తాజాగా ధమాకా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా , శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని దర్శకుడు త్రినాధ్ రావు నెక్కిన మాస్ రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మాస్ క్రాకర్ అనే పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో చిత్ర బృందం ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలను చూపించింది.
ఆ యాక్షన్స్ అన్ని వేషాలు ఈ మూవీ కి హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మాస్ క్రాకర్ వీడియోలో రవితేజ ఒకటి రెండు డైలాగ్ లను కూడా చెప్పాడు. ఆ డైలాగ్ లు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మాస్ క్రకార్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మాస్ క్రకర్ వీడియోలో భాగంగానే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 23 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడీ , రామారావు అన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయాయి. మరి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ ఈ సంవత్సరం విడుదల కాబోయే తన మూడవ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.