ఆ హీరో మాటలకు కళ్ళ నీళ్లు పెట్టుకున్న బాలయ్య..!!

murali krishna
నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు వ్యాఖ్యాతగా కూడా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు బాగా తెలిసిందే.


ఇలా వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం సీజన్ టు కార్యక్రమాన్ని కూడా అంతే విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి రెండవ సీజన్లో భాగంగా మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడుని ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే.ఇక రెండవ ఎపిసోడ్లో భాగంగా సిద్దు జొన్నలగడ్డ విశ్వక్ సేన్ హాజరవుతున్నట్లు ప్రోమో కూడా విడుదల చేశారు.


ఈ విధంగా మొదటి సారి విడుదల చేసిన ప్రోమోలో భాగంగా యంగ్ హీరోలతో కలిసి ఎంతో ఎంతో సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరో ప్రోమోని కూడా విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ ఈ యంగ్ హీరోలతో కలిసి మాట్లాడటమే కాకుండా వారి జీవితంలో జరిగినటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ని గురించి కూడా చెప్పమని ప్రశ్నించారు.ఈ క్రమంలో నే సిద్దు జొన్నలగడ్డను తన జీవితంలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ చెప్పమని అడగగా వెంటనే సిద్దు మాట్లాడుతూ తాను హీరోగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొందరు తనని అవమానించారని తెలిపారట.


నీ మొహానికి నువ్వు హీరో కావడం ఏంటి అని తనని అవమానపరిచారని తనకు జరిగిన చేదు సంఘటన గురించి సిద్దు చెప్పగానే వెంటనే బాలకృష్ణ కళ్లనిండా నీళ్లు పెట్టుకున్నారట..నువ్వు ఇలా చెబుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఒకసారి తన ని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఇలా ఈ కార్యక్రమాని కి సంబంధించిన ఈ ప్రోమోలో భాగంగా సిద్దుకు జరిగిన అవమానం తెలుసుకున్న బాలయ్య ఎంతో ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో అయితే వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: