దసరా ను వెంటాడుతున్న పుష్ప జ్ఞాపకాలు !
ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఈమధ్యనే విడుదలైన మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తానా’ కు విపరీతమైన స్పందన వస్తోంది. ఈపాటలో నాని చాల రఫ్ లుక్ లో గుబురు గడ్డం చింపిరి జుట్టు మాసిన లుంగీ నలిగిన చొక్కాతో చాల రఫ్ గా కనిపించాడు. అయితే ఈ లుక్ ను ‘పుష్ప’ లో అల్లు అర్జున్ గెటప్ తో సరిపోలుస్తూ సోషల్ మీడియాలో కొందరు నానీని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పటికే ఇలాంటి రఫ్ లుక్ అల్లు అర్జున్ పుష్పరాజ్ అవతారంలో చూసామని ఇలాంటి లుక్ ను మళ్ళీ నాని రిపీట్ చేయడం వల్ల ‘దసరా’ సినిమాలో ఏ స్పెషాలిటీ కనిపిస్తుంది అంటూ కొందరు నానీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈమధ్యనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ లుక్ ను ‘పుష్ప’ మూవీలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్ర గెటప్ తో పోలుస్తూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
‘పుష్ప’ మూవీలో రష్మిక పెళ్ళి కూతురుగా పసుపు రంగు సారీలో ఎలాంటి లుక్ లో కనిపించిందో అలాంటి లుక్ ఛాయలు కీర్తి సురేష్ పెళ్ళికూతురు గెటప్ లో కనిపించడమే కాకుండా ఏకంగా రష్మిక కట్టుకున్న పసుపు రంగు శారీ కలర్ ను కీర్తి సురేష్ విషయంలో కూడ అనుసరించారు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. దీనితో ‘పుష్ప’ ఛాయలు దసరా’ లో ఉన్నాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..