పూరిజగన్నా థ్‌ఓ బ్రాండ్ అని అభిమానులు చెబుతుంటారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌ని పట్టించుకోని మేకర్ ఆయన. ఎంతోమంది స్టార్‌లకు హిట్ ఇచ్చిన చరిత్ర ఆయనకుంది పలు కారణాలతో ఆర్థికంగా జీరోకి పడిపోయి పడి లేచిన కెరటంలా మళ్లీ పుంజుకుని గాడిలో పడ్డారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ సక్సెస్‌కి కాస్త దూరం అయ్యారు. ప్రయత్న లోపం లేకపోయినా ఎక్కడో తేడా జరగడం వల్ల ఆయన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా ఆడలేదు. 'ఇస్మార్ట్ శంకర్'తో ఫామ్‌లోకి వచ్చిన ఆయన తాజాగా ప్యాన్ ఇండియా స్థాయిలో 'లైగర్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు డేట్స్ ఇచ్చే హీరోలు లేకపోవడంతో తన కుమారుడు ఆకాశ్‌తో సినిమా తీస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే పూరి మాత్రం జనాలు అనుకుంటున్నట్లు సైలెంట్‌గా లేరు. బాలీవుడ్‌పై దృష్టి సారించారని సన్నిహితుల ద్వారా సమాచారం. తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పూరి జగన్ బాలీవుడ్ హీరోలు రణవీర్ సింగ్ విక్కీ కౌశల్ లను కలిశారని, ఆగిపోయిందనుకున్నజనగణమన' వీరిద్దరిలో ఒకరితో చేసే సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. 'లైగర్' విడుదలకు ముందే విజయ్‌తో జనగణమన' చిత్రాన్ని విజయ్‌తో ప్రారంభించారు పూరి. 'లైగర్' పరాజయం కావడంతో ఇక విజయ్ దేవరకొండ.. పూరితో సినిమా చేయడం లేదని గాసిప్పులొచ్చాయి. ఈ మధ్యనే జరిగిన 'సైమా' అవార్డ్ వేడుకలో ఈ ప్రాజెక్ట్ గురించి అడిగితే సైలెంట్‌గా తప్పించుకున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని విజయ్ చేయకపోయినా బాలీవుడ్ హీరోలతో చేయాలనుకుంటున్నారట పూరి జగన్నాథ్. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూరి ఆర్థికంగా దెబ్బతిన్నారనే వార్తల్లో కూడా నిజం లేదనిపిస్తోంది. ఆయన అడిగితే పెట్టుబడి పెట్టే వారు చాలామందే ఉన్నారట. ముంబైలో ప్రారంభించిన కార్యాలయం కూడా అలాగే ఉందని తెలిసింది. దీనిని బట్టి పూరి మరోసారి బాలీవుడ్‌పై గురిపెడుతున్నట్లు అర్థమవుతోంది.