సల్మాన్ ఖాన్ కు డెంగీ ఫీవర్...!!
ఆయన ఫ్యామిలీ డాక్టర్ తో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 16 కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా తప్పకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ నెల 25 నుంచి తాజా షెడ్యూల్ జరుపుకోనుంది అయితేు ఈ షూటింగ్ లో సల్లుూ భాయ్ పాల్గొననున్నట్టు సమాచారం. . ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్ నిర్మించగా, సల్మాన్ కు సడెన్ గా డెంగీ ఫీవర్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిందట.. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతుండటం. సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యం విషయంలో బెటర్ ఫీల్ అవుతుండటంతో మూవీ షూటింగ్ పై ఆయన దృష్టి పెట్టారట.
అంతే కాదు సల్మాన్ ఖాన్ ప్రతీ సారి దివాళికి ఏదో ఒక సందడి అయితే చేస్తుంటారు. కాని ఈసారి ఆయన అనారోగ్యం కారణంగా సల్మాన్ ఖాన్ ఈసారి దీపావళి పార్టీలకు కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.అయితే ఆయన అభిమానులు మాత్రం సల్మాన్ ఆరోగ్యం పై కలవర పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తున్నాయట.. సల్మాన్ కండీషన్ బాగోలేదని. కాస్త క్రిటికల్ గా ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది.
సల్మాన్ పరిస్థితి బాగోలేదని.. దాంతో మీడియా తో పాటు అభిమానులకు కూడా ఈ విషయం తెలియకుండా దాచేస్తున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి అంతేకాదు ప్రజెంట్ ఆయన ఐసీయూ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఈసారి బిగ్ బాస్ విషయంలో హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ను నియమించినట్లు సమాచారం. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్ధిస్తున్నారట.
ఇప్పటికే 16వ సీజన్ బిగ్ బాస్ ప్రకటన వచ్చేసింది.. అన్ని సీజన్స్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయగా.. ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ 16కి హోస్టుగా కరణ్ జోహార్ చేయబోతున్నాడు.ఈ విషయాని అఫీషియల్ గా ప్రకటించింది హిందీ బిగ్ బాస్ టీం.డెంగ్యూ వ్యాధి వల్ల సల్మాన్ ఖాన్ బాగా డల్ అయ్యాడట. మరి ఆయన ఎప్పుడు కోలుకుంటారో చూడాలి.