ప్రభాస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినా పూరీ జగన్నాధ్..!!

murali krishna
ప్రభాస్ ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై 'ఏక్‌ నిరంజన్‌'లా దూసుకెళ్తున్న 'మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌' ప్రభాస్‌.

మాస్‌ ఆడియన్స్‌కు ఆయన 'రెబల్‌'. క్లాస్‌ ఆడియన్స్‌కు 'డార్లింగ్‌'.వెండితెరకు 'బాహుబలి అని మనం చెప్పవచ్చు,. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్‌ చరిత్ర చాలానే ఉంటుంది మరి, ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌.. టాలీవుడ్‌కి మాత్రం ఎప్పుడూ 'డార్లింగే'. తెలుగు ప్రేక్షకులతో పాటు టాలీవుడ్‌ ప్రముఖులంతా ఆయనను ముద్దుగా 'డార్లింగ్‌'అని పిలుస్తుంటారు. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా 'డార్లింగ్‌' పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటో తెలుసుకుందాం.

బుజ్జిగాడు సినిమా తర్వాత అందరూ ప్రభాస్‌ని 'డార్లింగ్‌'అని పిలవడం  మొదలు పెట్టారు . ఆ సినిమా ప్రభాస్‌ డార్లింగ్ ఊతపదం వాడుతాడు. ప్రభాస్‌ నోటి నుంచి వచ్చిన ఆ పదం.. ఫ్యాన్స్‌ తెగ నచ్చేసింది అంటా మరీ, దీంతో ప్రభాస్‌కు 'డార్లింగ్‌'అనే నిక్‌ నేమ్‌ని ఇచ్చేశారు ఫ్యాన్స్‌. ఈ పేరు తెగ పాపులర్‌ కావడంతో ప్రభాస్‌ తరువాతి సినిమాకు ఏకంగా 'డార్లింగ్‌'అనే పేరే పెట్టేశారు. అది కూడా సూపర్‌ హిట్‌ అయింది. దీంతో ప్రభాస్‌కు డార్లింగ్ అనే పేరు ఇలా ఫిక్సయిపోయింది. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే.. సినిమాల్లోనే కాదు.. నిజంగా ప్రభాస్‌ ఊతపదం 'డార్లింగ్‌'. బుజ్జిగాడు సినిమాలో నటించకముందు నుంచే తన ఫ్రెండ్స్‌ను ప్రభాస్ డార్లింగ్ అని పిలిచేవాడంట. అయితే ఈ విషయం డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌కి తెలియదట. ఒకసారి బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ పూరిని డార్లింగ్ అని పిలిచేశాడట. అది నచ్చడంతో సినిమాలో ఆ ఊతపదాన్ని వాడేసినినట్లు పూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

'బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలిచేవాడు. నన్ను మాత్రమే అలా పిలుస్తున్నాడేమో అని చాలా సంతోషపడ్డాను. కానీ వేరేవాళ్లను కూడా ప్రభాస్ డార్లింగ్ అని పిలవడం చూశాను నేను, అప్పుడు డార్లింగ్ అనేది ప్రభాస్ ఊతపదం అని నాకు అర్థమైంది'అని పూరి ఓ ఇంటర్యూలో చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభాస్‌ కూడా స్వయంగా ఒప్పుకున్నాడు.

 

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్‌ ప్రస్తుతం ఓంరౌత్‌తో కలిసి ఆదిపురుష్‌ , 'కేజీఎఫ్‌'ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌ చిత్రాలు, చేస్తున్నాడు. వీటితో పాటు సందీప్‌ రెడ్డి వంగా, మారుతి దర్శత్వంలోనూ ప్రభాస్‌ మరో సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: