ఆసుపత్రి లో చేరిన అషు రెడ్డి... కారణం..!!
బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి హాస్పిటల్ లో ఉన్న విషయం తెలుసుకున్న యంకర్, బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించింది. అషు రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంది. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని కోరుకుంది. ఈ విషయం అషు రెడ్డి సోషల్ మాద్యమం ద్వారా తెలిపింది. తన ఆరోగ్యం బాగాలేదని తెలుసున్న తనను పరామర్శించడానికి వచ్చినందుకు అరియానా గ్లోరికీ కృతజ్ఞతలు తెలిపింది. వీరిద్దరి మద్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
టిక్ టాక్ వీడియలోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అషు రెడ్డి తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు కుర్రకారుకి మతులు పోయే విధంగా ఫోటో షూట్స్ తో సందడి చేస్తుంది. ఆ మద్య ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మరింత ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో పలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.