ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే కాంతారా.. తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా థియెటర్ల లోకి వచ్చిన ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ సినిమాల రికార్డులను తుడిచి పెట్టేసింది.కన్నడ స్థాయిని మరోసారి ఇండియాకు పరిచయం చేసిందీ చిత్రం. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డు కలెక్షన్లను సాధించి బ్లాక్ బ్లస్టర్గా నిలిచింది..ఈ సినిమా దెబ్బకు మిగిలిన డైరెక్టర్లకు గట్టి పోటీ ఎదురైందని చెప్పాలి.విడుదలైన అన్ని భాషల్లో అనూహ్య విజయాన్ని అందుకుందీ చిత్రం.
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ వసూళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీపావళి వరుస సెలవులు ఉండడంతో ఈ కలెక్షన్లను మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ విజయం లో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టిది కీలక పాత్ర అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ కథను అత్యంత అద్భుతం గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల తో ఔరా అనిపించింది. దీంతో రిషబ్ శెట్టి ఒక్క కన్నడనాటే కాకుండా దేశమంతా మారుమోగింది.
ఈ జోష్ తో ఈ డైరెక్టర్ తర్వాతి చిత్రంపై ఇప్పుడే షికార్లు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రిషబ్ శెట్టి తెలుగు లో ఓ చేయనున్నాడనే చర్చ మొదలైంది. రామ్ చరణ్ ఈ లో హీరోగా నటించనున్నాడనేది సదరు వార్త సారంశం.శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చెర్రీ.. ప్రస్తుతం ట్రిపులార్ జపాన్ విడుదల నేపథ్యం లో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శంకర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత రిషబ్ శెట్టి దర్శకత్వం లో చేయనున్నాడని తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలో నిజంగానే నిజం ఉందా.? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..