దీపావళి సెలెబ్రెషన్స్ లో తమన్నా ఫుల్ బిజీ..వీడియో..

Satvika
తమన్నా.. ఈ పేరుకు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎన్నో హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.. చిన్న హీరోల నుంచి పెద్ద హిరొల వరకూ అందరితో నటించి మంచి మార్కులను వేయించుకుంది..తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..ఎన్నో అవార్డులను కూడా అందుకుంది..ఒక్కప్పుడు ఫామ్ లో ఉన్న ఈమె ఇప్పుడు సినిమా అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి..



తెలుగు చివరిసారిగా ఎఫ్ 3 మూవీలో కనిపించిన ఈ మిల్కీబ్యూటీ.. హిందీలో బబ్లీ బౌన్సర్ తో అలరించింది. ఈ అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా.. మలయాళ ఇండస్ట్రీ లోకి కూడా అరంగేట్రం చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సందర్భంగా సెట్ లోని వారితో తన దీపావళి సెలబ్రెషన్స్ ఉత్సాహంగా జరుపుకోనున్నట్లు తెలిపింది.



తాను దీపావళి రోజు కూడా పనిచేయడం అంతగా సంతోషంగా లేదు అని.. కానీ సెట్ లో ఉన్న నటీనటులు, సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు తనకు ఎన్నో మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని.. అభిమానులు చూపించే ప్రేమే తనను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుందని చెప్పుకొచ్చింది. సత్యదేవ్ జంటగా నటించిన గుర్తుందా శీతాకాలం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ లో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టెయిల్ చిత్రానికి రీమేక్ గా రూపొందించిన ఇది. ఇందులో మేఘ ఆకాష్, కావ్యశెట్టి కీలకపాత్రలు పోషించారు. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న భోళా శంకర్ లోనూ తమన్నా నటిస్తుంది. ఇందులో కీర్తి చిరు చెల్లిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమా అన్నా తమన్నాకు హిట్ ను అందిస్తుందెమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: