కలర్ ఫోటో చిత్రం.. థియేటర్లో.. ఎప్పుడంటే..!!

Divya
హిట్ అయిన చిత్రం లేదా విమర్శకుల నుంచి ప్రశంశాలు అందుకున్న ఏదైనా చిత్రాలు లేదంటే అవార్డులు గెలుచుకున్న సినిమాల్లో ప్రజలలో మంచి క్యూరియాసిటీని ఎప్పుడు ఉంటుందని చెప్పవచ్చు. అగ్ర హీరోల కమర్షియల్ సినిమాలతో పాటు వీటి పైన మరికొంత యూరియాసిటీ కచ్చితంగా. ఇటీవల మహేష్ బాబు పోకిరి సినిమా, ఎన్టీఆర్ ఆది,, పవన్ కళ్యాణ్ జల్సా, బాలయ్య చెన్నకేశవరెడ్డి, ప్రభాస్ బిల్లా సినిమాలు రీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రెండు ఇప్పుడు మరి తదుపరిస్తాయికి చేరిపోతోందని చెప్పవచ్చు.
ఇప్పుడు ఓటీటి సినిమా తిరిగి థియేటర్లోకి వస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. గడిచిన రెండు సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్ నిర్ధారిస్తున్న సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఓటిటి నే ఎంటర్టైన్మెంట్ చేసిందని చెప్పవచ్చు. అలా ఓటీటి లో విడుదలైన కలర్ ఫోటో చిత్రం ఇప్పుడు తాజాగా థియేటర్లోకి వస్తూ ఉండడంతో సరికొత్త ట్రెండ్ అని చెప్పవచ్చు. యూట్యూబ్ సుహాన్, షార్ట్ ఫిలిం చాందిని చౌదరీ కలిసి నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ దర్శకత్వం వహించారు అలాగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా కూడా తెలుగు ప్రేక్షకులు మనసును గెలుచుకుంది.


ఈ సినిమా విడుదల ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 19 కలర్ ఫోటోషను మొదటిసారిగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మంచి గుర్తింపు దక్కడంతో థియేటర్ రిలీజ్ తో మరింత గుర్తింపు దక్కుతుందని చిత్ర బంధం చాలా నమ్మకంతో ఉన్నారు అందుచేతనే ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక తర్వాత చాందిని చౌదరి, సుహాన్ కు పలు చిత్రాలను నటించే అవకాశాలు వచ్చాయి. మరి ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: