ప్రభాస్.. మాళవిక కాంబినేషన్లో సినిమా రాబోతోందా..?

Divya
హీరో ప్రభాస్ కు ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి రోజున బర్తడే వేడుకలకు అభిమానులు సైతం సోషల్ వీడియో వేదికగా బర్తడే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసుకున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరొకవైపు ప్రభాస్ నటిస్తున్న చిత్రాల నుంచి పలు స్పెషల్ పోస్టర్లు కూడా విడుదల చేస్తు ప్రభాస్ అభిమానులను ఖుషి అయ్యేలా చేశారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ఆది పురుష్, ప్రాజెక్ట్ -k, సలార్ వంటి చిత్రాల నుంచి అప్డేట్ విడుదలైంది. అలాగే తమ అభిమాన హీరోకు అభిమానులే కాకుండా సినీ ప్రేమికుల సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.


నిన్నటి రోజున హీరోయిన్ మాళవిక మోహన్ డార్లింగ్ ప్రభాస్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. ఆమె తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడంతో ఆ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారుతోంది. దీంతో నెటిజెన్స్ ఈమె పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పుట్టినరోజు తెలియజేశారు సెలబ్రెటీలు అందులో దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ నీల్ ,జగపతిబాబు సుకుమారన్ మాళవిక తన ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది.


మాళవిక మోహన్ హ్యాపీ బర్తడే టు వన్ ఆఫ్ మై ఫేవరెట్.. మీరు మరింత ఎత్తుకు ఎదగాలి అంటు రాసు కోచ్చింది. మాళవిక చేసిన ఈ గిఫ్ట్ కాస్త నెట్టింటే చాలా వైరల్ గా మారుతుంది దీంతో వీరిద్దరి కాంబినేషన్లు చూసేందుకు ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక ప్రభాస్ కూడా మారుతి డైరెక్షన్లో ఒక ప్రాజెక్టును చేయవలసి ఉంది దీంతో వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: