తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోలుగా నటించి ఎన్నో సంవత్సరాల పాటుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి , బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ టైటిల్ ను మరియు టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ కి చిత్ర బృందం వాల్టేర్ వీరయ్య అనే టైటిల్ ను కన్ఫామ్ చేయగా , ఈ మూవీ టీజర్ ను కూడా విడుదల చేసింది.
అలాగే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వాల్తేరు వీరయ్య మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. దానితో ఈ ఇద్దరూ సీనియర్ స్టార్ హీరోలు వచ్చే సంవత్సరం సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బారిలో దిగడం కన్ఫామ్ అయ్యింది.