మెగా కల్ట్ ఫ్యాన్స్.. వాల్తేరు వీరయ్య ఫుల్ మీల్స్ పక్కా..!

shami
ఇప్పుడున్న యువ ప్రేక్షకులకు ఏం తెలుసు మెగాస్టార్ మెగా మేనియా అంటే ఆయన లుంగీ కట్టి బీడీ నోట్లో పెడితే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. నిన్నటితరం హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు స్టార్స్ లో చిరంజీవి ఒకరు. అప్పట్లో ఆయన కి ఇండియన్ వైడ్ ఏ స్టార్ హీరో కూడా తీసుకోని రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే మెగాస్టార్ కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాలు చేయాలని అనుకున్నారు. అది వర్క్ అవ్వక మళ్లీ వెండితెర రీ ఎంట్రీ ఇచ్చారు.

రీ ఎంట్రీ టైం లో ఖైదీ నెంబర్ 150 చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి చిరు మెగా మాస్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఏజ్ బార్ అయింది కదా ఇంకెక్కడి మాస్ అనుకుని గమ్మున ఉన్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఒక మెగా ఫ్యాన్ మెగాస్టార్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇన్నాళ్లు ఆరాధించిన ఆయన్నే డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. దానితో ఆయన్ని మెగా ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలానే దించేశాడు. బాబీ డైరక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈరోజు దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది. ఈ టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పొచ్చు.

మెగా కల్ట్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒకప్పటి చిరుని పరిచయం చేసేలా ఉంది. జస్ట్ టీజర్ తోనే అరుపులు పెట్టించగా ఇక సినిమా రఫ్ఫాడించేయడం ఖాయమని చెప్పొచ్చు. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ కి వాల్తేరు వీరయ్య స్పెషల్ ట్రీట్ అందించడం పక్కా అనిపిస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా వస్తుంది. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: