పెళ్లి చేసుకోబోతున్న పవన్ హీరోయిన్...!!
కొమరం పులి సినిమాతో నటిగా నికిషా పటేల్ కెరీర్ మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నికిషా పటేల్ పలు తెలుగు సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఈ మధ్య కాలంలో నికిషా పటేల్ కు ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్లు రావడం లేదు. అయితే ఈ స్టార్ హీరోయిన్ పెళ్లిపై దృష్టి పెట్టార ని సమచారం అయితే అందుతోంది. నికిషా పటేల్ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ విదేశాల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో నికిషాకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా నికిషా పటేల్ తాను విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చారు. త్వరలో తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నానని ఆమె కామెంట్లు చేశారు. తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలను నికిషా పటేల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారట.. నికిషా పటేల్ షేర్ చేసిన పోస్ట్ కు 1000కు పైగా లైక్స్ వచ్చాయి. నికిషా పటేల్ రాబోయే రోజుల్లో సినిమా రంగంలో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.
నికిషా పటేల్ భర్త బాగున్నాడని జోడీ అందంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నికిషా పటేల్ పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నికిషా పటేల్ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారట.. కథల ఎంపికలో పొరపాట్ల వల్లే ఆమె సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారట..