మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పవర్ , సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వెంకీ మామ మూవీ లకు దర్శకత్వం వహించిన బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ మూవీ లో శృతి హాసన్ , మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
మాస్ మహారాజ రవితేజ ఈ మూవీ లో 40 నుండి 45 నిమిషాల నిడివి గల పాత్రలో కనిపించ బోతున్నట్లు , ఈ పాత్ర ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నిన్న అనగా అక్టోబర్ 24 వ తేదీన దీపావళి సందర్భంగా చిరంజీవి , బాబి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ టైటిల్ టీజర్ లో చిరంజీవి అద్భుతమైన మాస్ లుక్ లో కనిపించడంతో ఈ టైటిల్ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. 24 గంటల సమయం ముగిసే సరికి ఈ టైటిల్ టీజర్ 8.12 మిలియన్ వ్యూస్ ను , 266 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే వాల్తేరు వీరయ్య మూవీ టైటిల్ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.