మహేశ్ బాబు:హైదరాబాదులో ఆ ఏరియాలో కొత్త వ్యాపారం మొదలు..!!
నమ్రతకు బాలీవుడ్ యాడ్స్ ఏజెన్సీ లతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్ లో కూడా మహేష్ త్వరలోనే ఒక డిఫరెంట్ యాడ్ లో చేయబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఇప్పటికే పలు వ్యాపారాలు కూడా మొదలుపెట్టి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఏషియన్ సినిమాతో కలిసి స్థాపించిన AMB మల్టీప్లెక్స్ మంచి ప్రాపర్టీ తో కొనసాగుతోంది. దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ నిర్మించిన కొన్ని థియేటర్లలో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు మహేష్ బాబు మరొకసారి హోటల్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఒక షాప్ ఏరియాలో ఈ హోటల్ నిర్మాణం జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ హోటల్కు ఇష్టమైన భార్య పేరు వచ్చేలా మహేష్ నామకరణం చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో కూడా ఏషియన్ వాళ్లు భాగస్వామ్యం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏషియన్ అమృత పేరుతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్ నవంబర్ నెలలో మొదలుకానున్నట్లు తెలుస్తున్నది. మరొకటి డిసెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ప్రతి ఏడాది తన పాపులారిటీ పెంచుకోవడమే కాకుండా వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి చెందుతున్నారని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు.