తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాత గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అల్లు అరవింద్ ఇప్పటికే గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో మూవీ లను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. అలాగే గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఎన్నో మూవీ లు ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అరవింద్ ఈటీవీ లో ప్రసారం అయిన ఆలీతో సరదాగా అనే టాక్ షో లో గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ టాక్ షో లో భాగంగా అల్లు అరవింద్ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ టాక్ షో లో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ... రామ్ చరణ్ , అల్లు అర్జున్ తో ఒక మూవీ చేయాలి అనే కోరిక ఉంది అని, అందుకోసం ఇప్పటికే చరణ్ అర్జున్ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాను అని , అలాగే చాలా సంవత్సరాలుగా ఈ టైటిల్ ను రెన్యువల్ చేయిస్తూ వస్తున్నాను అని అల్లు అరవింద్ తాజాగా చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో చరణ్ అర్జున్ అనే మూవీ కి ప్రముఖ దర్శకులలో ఒకరు అయినటు వంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకుఎలాంటి అధికారిక ప్రకటన వెలబడ లేదు. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియామూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పుష్ప ది రూల్ మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన , అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియామూవీ గా రూపొందబోతుంది.