నిఖిత కోసం సొంత భార్యకు గన్ను పెట్టిన స్టార్ హీరో...!!
ఒక తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో తన సినిమాలతో మంచి పేరుని సంపాదించుకుంది. ఇక కన్నడ బిగ్ బాస్ లో సైతం పాల్గొంది నిఖిత. నిఖిత నాగార్జున సరసన డాన్ సినిమాలో కూడా నటించింది అయితే ఆమెకు రావాల్సినంత స్టార్ డం అయితే రాలేదు. స్టార్ హీరోయిన్ గా ఎదగడంలో మాత్రం ఆమె విఫలమయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్న నిఖిత తన జీవితంలో మాత్రం అనేక వివాదాల్లో ఇరుక్కుంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ తో ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ బంధం చిగురించింది.
ఈ విషయం సోషల్ మీడియాతో పాటు మీడియా కూడా వార్తలు ప్రచురించడం తో దర్శన్ భార్య వరకు విషయం వెళ్ళింది. దర్శన్ తన భార్య విజయలక్ష్మి తో అదేం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా దర్శన్ తో నిఖిత ని పట్టుకున్న విజయలక్ష్మి ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా ముందు కూడా విజయలక్ష్మి తన భర్త గురించి నిఖిత గురించి కామెంట్స్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక దర్శన్ సైతం తాగిన మత్తులో తన భార్య తలకు గన్ను గురి పెట్టి బెదిరించడం తో ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
తన భర్త పై వేధింపులు, అక్రమ సంబంధం వంటి సెక్షన్లతో విజయలక్ష్మి కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ నీ అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. దీంతో కన్నడ ఇండస్ట్రీ అంతా కూడా బగ్గుమంది. ఈ దెబ్బతో కన్నడ అసోసియేషన్ మూడేళ్ల పాటు నిఖిత ను సినిమాల నుంచి బ్యాన్ చేసింది. ఆ తర్వాత మూడు రోజులకు నిఖిత బ్యాన్ విషయంలో ఇండస్ట్రీ లో తీవ్ర నిరసన వ్యక్తం కావడం తో ఆ బ్యాన్ ని ఎత్తివేసింది. ఈ సమయంలో నిఖిత తీవ్ర డిప్రెషన్ కి గురవడంతో పాటు బ్లడ్ ప్రెజర్ కూడా బాగా తగ్గడంతో హాస్పిటల్ పాలయ్యింది. దర్శన్ చేసిన తప్పుకు నిఖిత కి శిక్ష విధించడం పట్ల కన్నడ మూవీ ఇండస్ట్రీ అంత ఏకం అయ్యి ఆమెకు న్యాయం చేసింది.