మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.ఇక మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.అయితే ప్రస్తుతం చిరంజీవి ఇప్పుడు కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో "వాల్తేరు వీరయ్య" సినిమాతో బిజీగా ఉన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి . భారీ అంచనాల మధ్య
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. అయితే ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వారు ఈ సినిమా రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఇప్పటికే దీని తాలూకా సగం పేమెంట్ అయిపోయిందని పూర్తి పేమెంట్ అయిపోగానే చిత్ర రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయని సమాచారం.
అయితే ఇక ఒకవేళ సినిమా విడుదలైన మూడు వారాలకి ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు పర్మిషన్ ఇస్తే నెట్ఫ్లిక్స్ వారు మరికొంత ఎక్కువ అమౌంట్ ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట.అయితే మరి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు దీనికి ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది, పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా వసూళ్లు వచ్చాయి..!!