తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో ఇతర భాష మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ "నానే వరువేన్" అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో నేనే వస్తున్నా పేరుతో విడుదల చేశారు.
ఈ మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తెలుగు ప్రేక్షకుల నుండి చెప్పుకోదగ్గ ఆదరణ లభించ లేదు. దానితో ఈ మూవీ తెలుగు లో పెద్ద విజయం సాధించ లేదు. అలాగే ఈ మూవీ కి తమిళ్ నుండి కూడా పెద్దగా ప్రేక్షకాదరణ లభించ లేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా లభించ లేక పోయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి అనగా అక్టోబర్ 27 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా అక్టోబర్ 27 వ తేదీ నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.