పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్..

Satvika
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలల్లో బిజీగా ఉన్నాడు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా తన పార్టీని నిలుపుకోవడాని కి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సినిమాల లో బిజీ అయ్యాడు.. తక్కువ సమయం లో సినిమాల ను పూర్తి చెయ్యాలని పవన్ కళ్యాణ్ డైరెక్టర్లకు చెప్పారు.. ఇక విషయానికొస్తే..  పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కొన్ని సంఘటనలు ఆధారంగా రాబోతుంది..



తన వీరోచితమైన పోరాట ప్రతిభ తో తెలుగు గడ్డ పై చెరగని ముద్రవేసిన “వీరమల్లు” పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.ఇక ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకుని చాలా కాలం అయినప్పటికీ, పవన్ రాజకీయ వ్యవహారాల వల్ల సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. కాగా ఇటీవలే సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వర్క్ షాప్ ని కూడా నిర్వహించింది. ఈ నేపథ్యం లో భాగంగా పవన్ కొన్ని యాక్షన్ సన్ని వేశాల కోసం భారీగా కసరత్తు చేశాడు.



తాజాగా ఈ సినిమా షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం అయింది. కేవలం 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో పవన్ పై కొన్ని యాక్షన్ అండ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినన్నారు. ఇందు కోసం ఒక ప్రత్యేక సెట్ ని రూపొందించి నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం లో నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి... ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: