అవతార్-2 మరొక సంచలనం.. జేమ్స్ కామెరూన్

Divya
జేమ్స్ కామెరూన్ ఒక అద్భుత సృష్టి అని చెప్పవచ్చు. అవతార్-2 ది వెవ్ ఆఫ్ వాటర్ డిసెంబర్లో విడుదల చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా విజువల్ వండర్ అని చెప్పవచ్చు. దశాబ్ద కాలముగా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. మరో రెండు నెలలు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్ పనులను అప్పుడే మొదలుపెట్టేశారు. ఇక ఈ సినిమా ఎంతటి విజువల్ గా ఉంటుంది అనే విషయంపై ప్రతి ఒక్కరు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి కామెరూన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వాటి గురించి తెలుసుకుందాం.

అవతార్-2 సినిమా మార్వెల్ - డిసీ ఫ్రాంచైజ్ చిత్రాలలోని ప్రాంతాలలో లేని పరిపక్వత రాబోయే అవతార్-2 సినిమా అని తెలియజేశారు. గతంలో మార్వెల్ డిస్నీ నుంచి వచ్చిన సూపర్ హీరోల చిత్రాల పైన పలు రకాల విమర్శలు కూడా వినిపించాయి. ఇక ఈ సినిమాలోని వారంతా ఏదో కళాశాలలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు కూడా ఎదురయ్యాయి. అవతార్ సీక్వెల్ వర్తింగట్ జో సుల్తానా పోషించిన జాక్.. నేయిత్రి పాత్రలు తమ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి చాలా కష్టపడతాయని తెలియజేశారు.
ప్రస్తుతం ఈయన చేసిన ఈ వాక్యాలు కాస్త నెట్ ఉంటే చాలా వైరల్ గా మారుతున్నాయి.కామెరూన్ తన సినిమా గొప్పదనం కోసం ఇతర చిత్రాలను తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు అని తెలియజేశారు గా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి వీటి పైన హాలీవుడ్ దిగ్గజాలు ఎలాంటి విధంగా సమాధానాన్ని ఇస్తారు చూడాలి. ప్రస్తుతం అవతార్-2  సినిమా పై నెటిజన్లు సైతం ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన అవతార్ చిత్రం కూడా మంచి భారీ విజయాన్ని చేకూర్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: