మరొకసారి తన అభిమానాన్ని చాటుకుంటున్న రష్మిక..!!
అందుకే ఈ సినిమా ముహూర్తం పెట్టిననాటి నుంచి ఈ సినిమా షూటింగ్లో ప్రతిరోజు ప్రతి మూమెంట్ ను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటోంది రష్మిక. అంతేకాకుండా ఈ షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు విజయ్ తో సెల్ఫీ దిగినటువంటి ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి అలాంటి సెల్ఫీతోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. వారసుడు సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఈ సెల్ఫీ విజయ్ తో పాటు హీరోయిన్ ఖుష్బూ కూడా ఉన్నది.
మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న వారసుడు చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు చిత్ర బృందం. ప్రస్తుతం రష్మిక పుష్ప -2 సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఒక బాలీవుడ్ లో గుడ్ బై సినిమా ఇటీవల కాలంలో విడుదల కాగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దాంతో రష్మిక నటించిన తదుపరి చిత్రం మిషన్ మజ్ను మీదే ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమాతో సక్సెస్ అవుతుందేమో చూడాలి.
Rashmika, Vijay