మహేష్ తో భారీ ఫైట్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి...!!

murali krishna
బాహుబలి 2, rrr రెండు కూడా దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం జరిగింది. రెండు కూడా భారతదేశ చలన చిత్ర రంగంలో మైలు రాయి చిత్రాలు గా నిలిచిపోయాయి.

అంతే కాదు ప్రపంచ స్థాయి లో ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి కూడా పెంచడం జరిగింది. ఇక దేశంలో ప్రపంచవ్యాప్తం గా కూడా టాలీవుడ్ పేరు మారు మ్రోగింది.ఇది లా ఉంటే ఇప్పుడు rrr తర్వాత నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో రాజమౌళి చేయనున్న విషయం తెలిసిందే.


ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పను లు కూడా జరుగుతున్నాయి. రాజమౌళి ఇప్పటి వరకు తాను తీసిన అన్ని సినిమాల్లో కంటే హై బడ్జెట్ సినిమాగా… ఇది తెరకెక్కుతోందట పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా లో అదిరిపోయాయి యాక్షన్ సీన్ రాజమౌళి ప్లాన్ చేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పూర్తి విషయంలో కి వెళ్తే ఈ సినిమాలో నరారూప రాక్షసులతో ఒక ఫైట్ రాజమౌళి ప్లాన్ చేయడం జరిగిందట. ఆఫ్రికా అడవుల్లో పచ్చి మాంసం తినే మనుషుల తో ఈ క్రేజీ ఫైట్ ఉండనున్నట్లు సమాచారం. ఇందు కోసం హాలీవుడ్ స్టంట్ టీం రానున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.

 
యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా లో …ఈ ఫైట్ హైలైట్ అయ్యే లా జక్కన్న ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు కూడా అవుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారట.. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28వ తారీకు విడుదల కానుంది. ఈ సినిమా అయిన వెంటనే రాజమౌళి సినిమాని మహేష్ స్టార్ట్ చేయనున్నార ని తెలీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: