విజయ్ దేవరకొండ "ఖుషి" మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అప్పటినుండే..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ బాక్సింగ్ నేపథ్యంలో తేరకెక్కిన లైగర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. లైగర్ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరోత్సాహ పరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఖుషి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకలలో ఒకరు అయినటువంటి శివ నిర్వాణా దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ నవంబర్ 15 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా , ఆ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ,  సమంత లుక్ లు డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ ,  సమంత ఇది వరకు మహానటి మూవీ లో కలిసి నటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: