రష్మిక ఆ జాబితా లో చేరిందా!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో కోట్ల రూపాయలు అందుకునే అదృష్టం చాలా కొద్ది మందికే ఉంటుంది. మొదటగా హీరోలు అంతటి స్థాయిలో పారితోషకాన్ని అందుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దర్శకులు మాత్రమే అలాంటి పారితోషకాలను అందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. పెద్ద హీరోయిన్లకు మాత్రమే కోట్ల కొద్ది డబ్బులు కుమ్మరిస్తూ ఉంటారు నిర్మాతలు. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఉన్న హీరోయిన్ రష్మిక మందన కోట్ల రూపాయలను పారితోషకంగా అందుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని చెప్పాలి.

 తెలుగులో ఒక సాధారణ హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అగ్ర హీరోల సరసన నటించి యువతలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఇంతటి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. ఇంతటి సినిమా అవకాశాలను అందుకుంటుంది కాబట్టే ఈమెకు అన్ని భాషలలో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. కాబట్టే వరుస సినిమాలను చేస్తూ భారీ పారితోషకాలను అందుకుంటుంది. 

ఏకంగా ఐదు కోట్ల రూపాయలకు పైగా ఈ ముద్దుగుమ్మ అందుకోవడం విశేషం. తాజాగా ఒప్పుకుంటున్న చాలా సినిమాలకు ఐదు కోట్ల వరకు పారితోషకాన్ని ఈమె అందుకోబోతుందట. మరి నయనతార సమంత వంటి హీరోయిన్ ల సరసన చేరిపోయిన ఈమె త్వరలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా తన సత్తా చాటే అవకాశం ఉంది. ఇటీవల ఆమె నటించిన పుష్ప సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆమె క్రేజ్ రెట్టింపు అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పుష్ప రెండో భాగం సినిమా కూడా మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం ఏ స్థాయిలో ఆమెకు క్రేజ్ తెచ్చి పెడుతుందో చూడాలి. బాలీవుడ్లో ఆమె నటించిన ఓ సినిమా ఇప్పటికీ విడుదల కాగా ప్రస్తుతం నటించిన కొన్ని సినిమాలకు సంబంధించిన షూటింగులు జరుగుతున్నాయి. వాటి ద్వారా బాలీవుడ్ లో కూడా ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: