పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే భయపడుతున్నారట!!

P.Nishanth Kumar

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అంటే చాలా మంది నిర్మాతలు క్యూలు కడుతూ ఉండేవారు. ఎంతో మంది దర్శకులు వెయిటింగ్ లిస్టులో ఉండేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం పై చాలామంది దర్శక నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారట. దానికి కారణం ఆయన నటించబోయే సినిమాలో సెట్స్ పైన భారీగానే ఉండడం. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు దాటింది అని చెప్పాలి.

అప్పటి సినిమాను ఇప్పుడు మొదలుపెట్టి దానిని పూర్తి చేయబోతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న మరొక రెండు మూడు సినిమాలు ఇంకెప్పుడూ చేస్తాడు అన్న సందిగ్ధత కొంతమంది నిర్మాతలలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు చేయవలసిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా రెండేళ్ల క్రితం అనౌన్స్ అయిన కూడా ఆ సినిమా యొక్క షూటింగ్ ఇంకా మొదలు కాలేదు ఎప్పుడు మొదలవుతుందో అన్న క్లారిటీ కూడా లేదు.

ఈ నేపథ్యంలో రాబోయే కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు ఆయనతో సినిమా చేయాలి అంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారట. దానికి తోడు ఆయనతో సినిమా చేస్తే చాలా సమయం వృధా అవుతుంది అని దర్శకులు భావించడం వల్లనే ఆయనకు సినిమా అవకాశాలు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలలోకి వెళ్లిన తరువాత ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను ఆయన చేస్తారా అనేది చూడాలి. ఒకసారి రాజకీయాలలోకి వెళ్లి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాబోయే రోజులలో ఏ విధంగా సినిమాలలో నటిస్తారో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఆయన చేయవలసి ఉంటుంది. సుజిత్ దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: