మా అధ్యక్షుడిపై స్పందించిన ప్రకాష్ రాజ్..!

Divya
విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ పనితీరుపైన తాజాగా స్పందించడం జరిగింది . మా అధ్యక్షుడు పైన కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. మా అధ్యక్షుడిగా మంచి విష్ణు ఎన్నిక అయిన తర్వాత ప్రకాష్ రాజ్  మా అసోసియేషన్ పనితీరుపై అధ్యక్షులు మంచు విష్ణు పై కూడా స్పందించడం జరిగింది. సంవత్సరం క్రితమే మా అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పోటీగా దిగిన సంగతి అందరికీ తెలిసింది. ఇక ఇందుకు మంచు విష్ణు కూడా ఆపోజిట్ గా నిలబడడం జరిగింది.  ఇద్దరి ప్యానల్ మధ్య హోరా హోరి పోరు జరిగిన ఇందులో మంచు విష్ణు విజయం సాధించారు.



అయితే ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా ఓడిపోవడం మా సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆ తర్వాత ఆయనతోపాటు ఆయన ప్యానెల్ లో ఉన్న సభ్యులు సైతం రాజీనామా చేయడంతో ఈ విషయం పలు చర్చనీ అంశంగా మారింది.  ఇప్పుడు తాజాగా మంచు విష్ణు పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తున్న ప్రకాష్ రాజ్ మా పనితీరుపై స్పందిస్తూ.. మంచు విష్ణు పనిచేశారా లేదా అనేది సభ్యులకు తెలుసు ఎన్నికైన వాళ్లకు బాధ్యత ఉంటుందన్నారు. ఇటీవల మా కోసం చేసిన పనులను ప్రకటించారు కదా.. ఇప్పటికే 90% పనులన్నీ పూర్తి చేశామని ప్రకటించారు.


అంతేకాకుండా మంచు విష్ణు పదవి కాలం మరో ఏడాది ఉందని మాకోసం ఏం చేస్తారు చూద్దాం అన్నారు అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో పోటీ గురించి కూడా స్పష్టతనిచ్చారు.  వచ్చే ఎన్నికలలో పోటీకి ఇంకా సమయం ఉంది.. దాని గురించి అప్పుడు ఆలోచిద్దామని తెలియజేశారు.అయితే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్షులు మంచు విష్ణు ఆయన ప్యానెల్ నటుడు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఇటీవల ప్రత్యేకంగా మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ మా అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే 90 శాతం వరకు నెరవేర్చామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: