24ఏళ్ల అమ్మాయితో సహజీవనం చేస్తున్న పృద్వి...!!
ఇటీవలే రీఎంట్రీ ఇచ్చారట . అయితే కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆ వార్తలపై స్పందించారు పృథ్వీ. అయితే ఆ అమ్మాయికి 23 ఏళ్లు కాదని.. 24 అని.. అలాగే.. ఇంకా తమకు పెళ్లి కాలేదని.. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారట . ప్రేమకు వయసుతో సంబంధం లేదని..ఆ అమ్మాయి మలేషియాకు చెందిన యువతి కాదని.. తెలుగమ్మాయి అని స్పష్టం చేశారుట
పృథ్వీరాజ్ 1994లో బీనాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అహేద్ మోహన్ జబ్బర్ ఉన్నారు. తన భార్యతో గొడవలు జరగడం విడివిడిగా ఉంటున్నట్లు గా ఇటీవల ఓ ఇంటర్యూ లో తెలిపారు. ఇద్దరం అర్థం చేసుకుని మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నామన్నారు. కానీ నెలకొసారి తన కొడుకుని కలుస్తున్నామని తెలిపారట . కొంతకాలంగా ఒంటరి గా ఉంటున్న పృథ్వీ తెలుగమ్మాయి అయిన శీతల్తో ప్రేమలో పడ్డారు. ముందు నేను పెళ్లి కి ఒప్పుకోలేదు. ఆలోచించుకోమ ని చాలా సమయం ఇచ్చాను. కానీ ఆమె నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకు ఆమె కుటుంబం కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఏ వయసులో ప్రేమలో పడతారో చెప్పలేరు అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. త్వరలోనే శీతల్ ను వివాహం చేసుకుంటానని.. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నామని.. తన పై నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు .
తన మొదటి భార్యతో ఉండేందుకు అనేకసార్లు ట్రై చేశానని.. కానీ కుదరలేదని అన్నారు. కొడుకు కారణంగా ఆమె నిరాకరించిందని తెలిపారు. సెకండ్ మ్యారేజ్ గురించి తన మొదటి భార్యకు చెప్పానని చెప్పుకొచ్చారు.