కోలీవుడ్ స్టార్ హీరోలు
అజిత్ వర్సెస్
విజయ్ ఫైట్ రానున్న సంక్రాంతికి జరుగనుంది.
విజయ్ ప్రస్తుతం "వారిసు"
సినిమా చేస్తున్నాడు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని
వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ
సినిమా వస్తుంది. ఈ మూవీని 2023
సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు పోటీగా
అజిత్ "తునివు"
సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. హెచ్. వినోద్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీతో
అజిత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటనున్నారు.కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికీ కూడా తెలుగు సినిమాలతో పాటు ఒక్కటైనా అనువాద చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఈ అనువాద చిత్రాల సందడి రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ 'వారిసు' తెలుగులో 'వారసుడు'గా విడుదల కానుంది. ఇక అజిత్ కూడా కొన్నాళ్లుగా తన సినిమాల్ని తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 'తునివు' విషయంలోనూ ఇదే ఆనవాయితీని కొనసాగించనున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇదే జరిగితే ఈసారి టాలీవుడ్లో
సంక్రాంతి రేసు మరింత రసవత్తరంగా ఉంటుంది.
ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్ 'ఆదిపురుష్',
బాలకృష్ణ 'వీరసింహారెడ్డి',
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', అఖిల్ 'ఏజెంట్' చిత్రాలు పెద్ద పండగ బరిలో పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి.
ఈ జాబితాలోకి 'వారసుడు', 'తునివు' చిత్రాలు కూడా చేరి
సంక్రాంతి పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది.
అజిత్ సినిమా పోటీగా విడుదల చెయ్యడంతో వారసుడు నిర్మాత
దిల్ రాజుకి గట్టి దెబ్బ తగిలింది. ఎందుకంటే తునివు సినిమాని తమిళనాడులో ఉదయ
నిధి స్టాలిన్ బాగా సపోర్ట్ చేస్తూ ఆ
సినిమా హక్కులు కొనుక్కొని భారీ ఎత్తున అక్కడ ఈ సినిమాకి థియేటర్లు ఇస్తున్నాడు.
విజయ్ కు కూడా భారీగా థియేటర్లు దొరుకుతాయానుకోండి. కానీ అసలు సమస్య తెలుగులో మొదలైంది
దిల్ రాజుకి. తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ తెలుగు సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తుండటం
దిల్ రాజు వారసుడు సినిమాకి ఇబ్బందిగా మారింది. చూడాలి ఇక మున్ముందు ఏం జరుగుతుందో.