ప్రస్తుత కాలంలో సౌత్ ఇండియా సినిమాలు బాగా విజయం సాధించి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తెలుగులో ఈ ట్రెండ్ మొదలైంది.ఇంకా అలాగే కన్నడ నాట ఈ ఏడాది కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణా, చార్లీ 777 అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ జాబితాలో కాంతార సినిమా కూడా చేరింది. మొదట చిన్న సినిమాగా కన్నడ వరకే రిలీజ్ అయిన కాంతార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు.కాంతార విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇటీవల ఈ చిత్రం 200 క్లబ్ లో చేరింది. ఈ చిత్రం చూసిన తర్వాత పలువురు ప్రముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు హీరో రిషబ్ శెట్టిని ప్రశంసించారు. తమిళ వర్షన్ లో రిలీజ్ అయిన కాంతార చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో రిషబ్ శెట్టి నటనను మెచ్చుకున్నారు. అంతేకాదు రజినీకాంత్ స్వయంగా రిషబ్ ని కలిశారు.
అంతేకాదు రజినీ డైలాగ్ 'తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత..'అంటూ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.పాన్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి గొప్ప హీరో తనను కలిసి సినిమా మెచ్చుకోవడంపై రిషబ్ శెట్టి ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు. 'మీరు ఒక్కసారి మెచ్చుకుంటే.. వంద సార్లు మెచ్చుకున్నట్లే సార్.. మా కాంతార మూవీ చూసి మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు'అంటూ రజినీకాంత్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకి బీస్ట్ దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుద్ రవి చందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గత కొంతకాలంగా ప్లాపుల్లో వున్న సూపర్ స్టార్ ఈ సినిమాతో ఖచ్చితంగా పెద్ద భారీ హిట్ ని అందుకోవాలని చూస్తున్నారు.