ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తను నటించిన మొదటి చిత్రంతోనే బోల్డ్ హీరోయిన్ గా పేరు పొందింది. ఇక తర్వాత వచ్చిన అవకాశాలన్నీ కూడా ఈ ముద్దుగుమ్మకు ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే వచ్చాయి. దీంతో అనూహ్యంగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నది. ఇక తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ పలు ఆఫర్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో కుర్రకారులను సైతం మంత్రముగ్ధులు చేస్తూ ఉంటుంది.
అయితే ఈ ముద్దుగుమ్మకు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ను కూడా సద్వినియోగం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏవి సక్సెస్ కాలేకపోయాయి. ఇక దాంతో బోల్డ్ వీడియోలు,ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ హీరోయిన్ లను మించిపోయి ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అందాలను ఎంతగా చూపించిన కూడా మరింత అందంగా కనిపించేలా ఉంటుంది పాయల్. తాజాగా ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది.
పాయల్ రెగ్యులర్గా స్కిన్ షో చేసి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఈసారి అనూహ్యంగా ఇలాంటి సాంప్రదాయమైన ఫోటోలను షేర్ చేయడంతో కాస్త వి చిత్రంగా ఉందని పలువురు నేటిజన్స్ సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇలా ఎప్పుడు పాయల్ ను చూడలేదు అంటూ మరికొంతమంది ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా పాయల్ కూడా ఇలాంటి సంప్రదాయమైన దుస్తులలో కూడా ఎంతో అందంగా కనిపిస్తోంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్ద గుమ్మకు సంబంధించి పలు ఫోటో లు చాలా వైరల్ గా మారుతున్నాయి.