అనుపమ్ ఖేర్ జీవితంలో లో ఇంతా విషదమా..!!
ఈ షోలో అనుపమ్ ఖేర్ షోకి హాజరయ్యే సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు ఈ నటుడు, ఈ నేపథ్యంలోనే తాజాగా అనుపమ్ ఖేర్ షో కి అతని తల్లి దులరీ ఖేర్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో విషయాలను నవ్వుతూ పంచుకున్నారు అనుపమ్ ఖేర్ అతని తల్లి దులరీ ఖేర్. తన కొడుకులు తప్పు చేసినప్పుడు తాను ఏ విధంగా శిక్షించాను అన్న విషయాన్ని షోలో భాగంగా వెల్లడించింది దులరీ.
ఈ సందర్భంగా అనుపమ్ మాట్లాడుతూ.. ఒకసారి అనుపమ్ ఖేర్ స్కూల్ కి వెళ్లేటప్పుడు అతనికి తన తల్లి కొంత పాకెట్ మనీ ఇవ్వగా అతని బ్యాగులో తల్లి ఇచ్చిన చిల్లరతో పాటు మరొక మూడు పైసలు, రెండు పైసలు ఎక్స్ ట్రా కనిపించాయట మరీ, అప్పుడు అతని తండ్రి పోనీలే వదిలే అని ఊరుకోగా తల్లి మాత్రం దండించాల్సిందేనని తన కొడుకు అనుపమ్ ఖేర్ బట్టలు ఊడగొట్టి మరీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టింది అని ఈ సంద్భంలోనే తెలిపాడు అనుపమ్ ఖేర్. అయితే అలా ఒక రకంగా తన తల్లి తన మంచి కోసమే ఆ విధంగా చేసింది అని చెప్పుకొచ్చాడు నటుడు అనుపమ్ ఖేర్.
అనుపమ్ ఖేర్ తో పాటుగా అతడి తమ్ముడు రాజు ఖేర్ ను కూడా బాగా కొట్టేదట అతను తల్లి దులరి ఖేర్. ఒక చెట్టు కట్టెతో కొట్టగా శరీరమంతా దద్దుర్లు వచ్చేవని అలా ఒకసారి ఆ కట్టెతో బాగా కొట్టడంతో అనుపమ్ అనారోగ్యానికి కూడా గురయ్యాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ఆ చెట్టు విషపూరితమైనదని, ఆ కట్టెతో దండించొద్దని డాక్టర్ తెలిపాడు అని చెప్పుకొచ్చింది దులరి ఖేర్ మరీ.