సమంత వల్ల మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్న విజయ్ దేవరకొండ..!!

Divya
హీరోయిన్ సమంత తాజాగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గతంలో ట్రీట్మెంట్ కోసం సమంత పలు దేశాలకు కూడా వెళ్ళింది. బహుశా ఏదైనా సర్జరీ కోసం వెళ్ళి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతకాలం సమంత ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు కానీ మొదటిసారిగా యశోద సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులను కొనసాగిస్తున్న సమయంలో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇక సమంత త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు అభిమానుల సైతం అందరూ కోరుకుంటున్నారు.


అయితే ప్రస్తుతం యశోద సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సమంత అనారోగ్యం వలన ఖుషి సినిమా షూటింగ్ మధ్యలో ఉన్న ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు చిత్ర బృందం. కానీ ఇప్పుడు సమంత ఆరోగ్యం వల్ల ఈ సినిమా మళ్లీ అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు.  వాటికి తోడుగా విజయ్ దేవరకొండ మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ గ్యాప్ లో విజయ్ సమయాన్ని వృధా చేయకుండా మరొక ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నానూరిత ఒక సినిమా చేసేందుకు ఒప్పందం కుదురుచుకున్నట్లుగా సమాచారం. విజయ్ దేవరకొండ తో ఒక సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సమంత కోలుకునే లోపు ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ చేసే విధంగా చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఇక మళ్లీ సమంత కోలుకున్న తర్వాత ఒకవైపు ఖుషి సినిమా షూటింగ్లో చేస్తూనే మరొకవైపు ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని విజయ ప్లాన్ చేసుకుంటున్నాట్లుగా సమాచారం. దీంతో ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేయాల ఆలోచనలు విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: