అయోమయ పరిస్థితిలో సమంత కెరియర్ ?
వాస్తవానికి ఈ పరిస్థితి నుండి ఆమె కోలుకున్నప్పటికీ ఇప్పుడు టాప్ హీరోయిన్స్ మధ్య కొనసాగుతున్న విపరీతమైన పోటీ ఉన్న పరిస్థితులలో ఆమెకు అవకాశాలు వస్తాయా అన్నసందేహాలు చాలమందికి ఉన్నాయి. ఇప్పటికే నాగచైతన్యతో ఆమె విడిపోయిన తరువాత ఆమెతో నటించడానికి టాలీవుడ్ టాప్ హీరోలు చాలమంది ఆశక్తి కనపరచడంలేదు అన్నవార్తలు ఉన్నాయి.
దీనికితోడు ఇప్పుడు లేటెస్ట్ గా ఆమెకు అనారోగ్య సమస్యలు కూడ ఏర్పడటంతో ఆ సమస్య నుండి ఆమె తెరుకున్నప్పటికీ ఆమెకు ఎంతవరకు మళ్ళీ ఇదివరకులా అవకాశాలు వస్తాయి అన్నది సమాధానంలేని ప్రశ్న. ప్రస్తుతం సమంత నటించి వచ్చేనెల విడుదలకాబోతున్న ‘యశోద’ ఆమె కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ఇది పూర్తి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఒక హాస్పటల్ లో జరిగే క్రైమ్ చుట్టూ ఈసినిమా కథ ఉంటుంది.
ఇలాంటి సినిమాల విజయం ఆసినిమాలకు చేసే భారీ ప్రమోషన్ పై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్న సమంత తన సమస్యలను పక్కకుపెట్టి ఎంతవరకు ఈసినిమాను ప్రమోట్ చేస్తుంది ఒకవేళ ఆమె ప్రమోట్ చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితి ఓపెన్ సీక్రెట్ అయిన పరిస్థితులలో ఎంతవరకు ఈమూవీకి క్రేజ్ ఏర్పడుతుంది అన్న విషయాలు ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే సంమంతకు ఏర్పడిన అనారోగ్య సమస్యలు ఆమె ఫిజిక్ ను చాల ఆకర్షినీయంగా మార్చుకోవడం కోసం గంటల తరబడి ప్రతిరోజు ఆమె జిమ్ లో చేసిన విపరీతమైన ఫిజికల్ ఎక్సర్సైజులు వల్ల ఆమెకు ఈ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి అన్న అభిప్రాయం కూడ కొంతమంది వైద్యుల భావన..