మాస్ మహారాజా
రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రవితేజ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో
బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ,
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన
క్రాక్ మూవీ తో
రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇలా
క్రాక్ మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన
రవితేజ ఈ సంవత్సరం ఖిలాడి మరియు రామారావు అన్ డ్యూటీ
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ.లు కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలు అయ్యాయి. ఇది ఇలా ఉంటే
రవితేజ ఈ సంవత్సరం ధమాకా
మూవీ తో మరో సారి
రవితేజ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ధమాకా
మూవీ ని
డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా
మూవీ లో
శ్రీ లీల
హీరోయిన్ గా నటించగా , ఈ
మూవీ కి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే
రవితేజ ప్రస్తుతం రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు
మూవీ లలో
హీరో గా నటిస్తున్నాడు. అలాగే
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య
మూవీ లో ఒక కీలక పాత్రలో
రవితేజ నటిస్తున్నాడు.
ఇలా వరుస
మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న
రవితేజ సినిమాటో గ్రాఫర్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో కూడా ఒక
మూవీ లో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
రవితేజ సరసన ఇద్దరు ముద్దు గుమ్మలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ
మూవీ యూనిట్
రవితేజ సరసన నటించ బోయే ఇద్దరూ
హీరోయిన్ లను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
రవితేజ , కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తెరకెక్క బోయే
మూవీ లో అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య తప్పర్ ను
మూవీ యూనిట్ సెలెక్ట్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.