పెళ్లి పీటలు ఎక్కుతున్న హీరో హీరోయిన్లు ..!!
ఈ సారి మరెవరో కాదు..కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. వీరిద్దరూ ప్రేమికులుగా ఇప్పటికే కావాల్సినంత ప్రచారం పొందారు. కలిసి నటిస్తూ, ప్రేమను కొనసాగిస్తున్న ఈ జంట... ఇప్పుడు తమ బంధాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లబో తోందని తెలుస్తోంది. వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.
ఇందుకు సంబం ధించిన ఏర్పాట్లు జరుగు తూ ఉన్నాయి. ఎలాంటి ప్రకటన లేకుండా, పెద్దగా హడావుడి లేకుండా ఈ జంట తమ వివాహానికి ఏర్పాట్లు చేయించుకుంటోందట. కావాల్సిన వారిని పిలుచుకుని ఈ ఏడాది డిసెంబ ర్లోనే వీరు పెళ్లి చేసుకో బో తున్నట్టుగా రూమర్లు వినిపిస్తు న్నాయి.
విశేషం ఏమిటంటే..ఇలాంటి రూమర్లే ఇటీవల నిజం అయ్యాయి. కత్రినాకైఫ్- విక్కీ కౌశల్, అలియాభట్ -రణ్ బీర్ కపూర్ ల వివాహాలు ఇలానే జరిగాయి. మరి ఆ పరంపర లో సిద్ధార్థ్- కియరాల పెళ్లి కూడా జరగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.