సరోగసీ విధానంపై స్పందించిన వరలక్ష్మి.....!!
ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను షురూ చేసింది. ఈ క్రమంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాకు సంబంధించి విషయాలను ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. సినిమాలో 'సరోగసీ' అంశాన్ని చూపించడంతో దీనిపై యాంకర్ వరలక్ష్మి అభిప్రాయాన్ని కోరారు. స్పందించిన వరలక్ష్మి 'సరోగసీ'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల ఇండియాలో ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ పద్ధతి ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఇక 'యశోద' సినిమా కథలో సరోగసీ ఒక టాపిక్ మాత్రమే. అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలోనూ అటువంటి మనుషులు ఉన్నారని అనిపిస్తుంది... అంటూఆసక్తికరమై వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమా గురించి వివరిస్తూ.. ''యశోద'లో కథే హీరో. చిత్రంలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. గ్రేడ్ షేడ్స్ ఉన్న పాత్రలో నేను (వరలక్ష్మి) నటించాను. సమంత క్యారెక్టర్ కు, నా క్యారెక్టర్ కు మధ్య చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. చిత్రంలో నాది సెకండ్ లీడ్ అని చెప్పొచ్చు. దర్శకుల పనితీరు కచ్చితంగా మంచి ఫలితాన్నిస్తోంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, క్వాలిటీ విజువల్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయని చెప్పుకొచ్చింది. చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.