బాలయ్య షోలో మరో ఇద్దరు యంగ్ హీరోలు...!!!

murali krishna
అన్ స్టాపబుల్ సీజన్ 2 అరంగేట్రమే అదిరిపోయింది. ఎంటర్టైన్మెంట్ కి పొలిటికల్ టచ్ ఇచ్చి సూపర్ సక్సెస్ చేశారు. బాలయ్య బావగారు నారా చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ గెస్ట్స్ గా హాజరయ్యారు.కాంట్రవర్సీతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఎపిసోడ్ ఆసక్తికరంగా నడిపారు. బాబు-బాలయ్య ఎపిసోడ్ కి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సెకండ్ ఎపిసోడ్ సైతం బాలకృష్ణ తన ఎనర్జీతో రంజుగా నడిపారు.
అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ గెస్ట్స్ గా విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. కుర్రాళ్ళలో కుర్రాడైపోయిన బాలయ్య రొమాంటిక్ క్వచ్చన్స్ తో రచ్చ చేశారు. అమ్మాయిలకు బీట్ ఎలా వెయ్యాలో నుండి సాయంత్రం వేసే పెగ్గు వరకు అనేక విషయాలు చర్చకు వచ్చాయి. హీరోలుగా ఎదిగే ప్రయత్నంలో ఎదురైన కష్టాలు వంటి విషయాలతో ఎపిసోడ్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అవకాశాల కోసం విశ్వక్, సిద్దూ పడ్డ ఇబ్బందులు విన్న బాలయ్య సైతం ఉద్వేగానికి గురయ్యారు.
ఇక మూడవ ఎపిసోడ్ కి సమయం ఆసన్నం కాగా మరో ఇద్దరు యంగ్ హీరోలను రంగంలోకి దించాడు. నెక్స్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా అడివి శేష్, శర్వానంద్ వస్తున్నారు. దీనిపై ఆహా సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. దీంతో మరో ఆసక్తికర చర్చ సిద్ధమని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. నవంబర్ లో ఎపిసోడ్ 3 ప్రసారం కానుంది. బాలయ్య హోస్ట్ గా ఈ స్థాయి సంచలనాలు చేస్తాడని ఎవరూ ఊహించలేదుమరోవైపు అభిమానుల కోసం బాలయ్య సంక్రాంతి కానుక సిద్ధం చేస్తున్నారు. వీరసింహారెడ్డిగా బరిలో దిగనున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి హీరోగా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బాలయ్య సెంటిమెంట్ రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. వీరసింహారెడ్డి మూవీలో బాలయ్యకు జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: