పవిత్ర లోకేష్, నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఇటీవల వీరిద్దరూ కలిసి నటించిన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' మూవీ విడుదలైంది.ఈ సినిమాలో నరేష్ భార్యగా పవిత్ర లోకేష్ నటించారు. ఈ సినిమా విడుదల రోజు నరేష్-పవిత్ర నిద్రపోలేదట. ఇక రాత్రంతా మేల్కొని అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ రివ్యూలు చదివారట.ఇకపోతే అక్టోబర్ 28న తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఈ చిత్రం విడుదల చేశారు. కాగా విడుదల రోజు మూవీ ఫలితం ఏమిటీ? సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది?
అనే టెన్షన్ నరేష్-పవిత్ర లోకేష్ లలో నెలకొందట.ఇక దీంతో రాత్రి నిద్రపోకుండా సినిమా రివ్యూలు చదువుతూ కూర్చున్నారట. అయితే పాజిటివ్ రివ్యూలు చూశాక చాలా సంతోషపడ్డారట.ఇక అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ విడుదలైన నెక్స్ట్ డే… నరేష్-పవిత్ర జంటగా దిగిన ఫోటోతో పాటు ఈ వార్త పంచుకున్నారు.ఇకపోతే మలయాళ హిట్ మూవీ రీమేక్ గా ఇది తెరకెక్కింది. నరేష్-పవిత్ర లోకేష్ విడిపోయారు, వారి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతుండగా పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.ఇదిలావుంటే జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు,
మేము కలిసే ఉన్నామని హింట్ ఇచ్చారు. ఇక పవిత్రను వదిలేసిన సీనియర్ నటుడు నరేష్ మరో నటికి దగ్గరయ్యారంటూ ఇటీవల వరుస కథనాలు వెలువడ్డాయి.అయితే మూడో భార్య రమ్య రఘుపతితో విడిపోయాక నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. అంతేకాదు చాలా కాలంగా ఆమెతో ఆయన సహజీవనం చేస్తున్నారు. ఇక కొన్ని నెలల క్రితం వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.అయితే ఇద్దరూ జంటగా మహాబలేశ్వర్ ఆలయం సందర్శించారు.ఇక దీంతో నరేష్-పవిత్ర పెళ్లి చేసుకున్నారన్న పుకార్లు వినిపించాయి. కాగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టిన నరేష్ మేము వివాహం చేసుకోలేదు, కలిసి జీవిస్తున్నామని వెల్లడించారు. ఇక వీరి బంధాన్ని రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు..!!